క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

VUYYURU SUBHASH
గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా ఉద్ధృతంగా ఇది విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఇది గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో ఎక్కువ యువత కొవిడ్‌-19 భారినపడుతోందని వివరించారు. దీనికి ఈ కొత్త రకమే కారణం కావొచ్చన్నారు.  ఇది మూడో ఉద్ధృతికి దారితీయవచ్చని ప్రజారోగ్య నిపుణుడు ఉపుల్‌ రోహానా చెప్పారు. ఇక్క‌డ కేసులు ల‌క్ష్లల్లో ఉండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: