భార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లో క‌రోనా విధ్వంసం... కేసులు, మ‌ర‌ణాలు ఇవే

VUYYURU SUBHASH
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గ‌త 24 గంటలలో 2,73,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1619 మంది  మృతి చెందారు. గ‌త 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1,44,178గా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,61,919. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 19,29,329. క‌రోనాకు చికిత్స పొంది  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,53,821. క‌రోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి  సంఖ్య 1,78,769. గత‌ 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 12,30,007గా ఉంది. ‌‌‌‌‌‌‌‌

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: