క‌రోనా దెబ్బ‌కు హైద‌రాబాద్‌లో క‌ఠిన ఆంక్ష‌లు

VUYYURU SUBHASH
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు కఠిన ఆంక్షలను విధించారు. కేసులు రోజు రోజుకు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో లాక్ డౌన్ విధించాల‌న్న డిమాండ్లు కొంత ఉన్నా ప్ర‌భుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ క్ర‌మంలోనే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేస్తోంది. బ‌య‌ట‌కు వ‌చ్చే వారికి మాస్క్ తప్పని సరి చేశారు. మాస్క్ పెట్టుకోకుండా కన్పిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. దీంతో పాటు మూడు కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు చేస్తారు. కోవిడ్ నిబంధనలను పాటించిన దుకాణాల యాజమాన్యంపై కేసులు పెడుతున్నారు. ఇకపై మాస్క్ లేకుండా బయటకు వెళితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: