ఎన్నిక‌ల్లో 92వ సారి పోటీ.... ఇప్పుడు భార్య‌పైనే పోటీ

VUYYURU SUBHASH
ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ఎలాగైనా గెలవాలని పోటీ చేస్తుంటారు. మారిన రాజ‌కీయాల నేప‌థ్యంలో ఒక సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించాలంటేనే చాలా క‌ష్ట‌ప‌డాలి. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాలి.. ఎవ‌రైనా నాలుగైదు సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తేనే ఇక చాల‌నుకునే ప‌రిస్థితి. అయితే ఓ వ్య‌క్తి ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా 92 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేత ఎవ‌రో కాదు యూపీలోని అగ్రాజిల్లా ఖైరాగఢ్ కు చెందిన అంబేడ్కరి హాసనురామ్ అనే వ్యక్తి 1985 నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు.

ఇన్ని సార్లు పోటీ చేసినా ఆయ‌న ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. 1985లో తొలిసారిగా బిఎస్పీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఇంట్లో భార్యే నిన్ను గుర్తుపట్టలేదు... మిగతా వాళ్ళు ఎలా ఓటు వేస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు 92వ సారి పోటీ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయ‌న పోటీ చేస్తోన్న వార్డులోనే ఆయ‌న భార్య కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. తాను 100 సార్లు ఓడి రికార్డుల‌కు ఎక్కుతాన‌ని అంబేడ్క‌రీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: