వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

VUYYURU SUBHASH
ఇటీవ‌ల రెండు శ‌స్త్ర చికిత్సలు చేయించుకుని... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థిితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలో రోజా సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలోనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఎన్నికలను పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని జగన్ రోజాకు సూచించారు. విశ్రాంతి తీసుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: