ర‌త్న‌ప్ర‌భ వ్యాఖ్య‌ల‌తో తిరుప‌తిలో బీజేపీకి ఘోర అవ‌మ‌నామేనా ?

VUYYURU SUBHASH
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న రత్న ప్రభ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని అన్నారు. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని రత్న ప్రభ అన్నారు. ఏపీలో ప్ర‌జ‌లు ఇప్ప‌టికే బీజేపీ చేసిన వ‌రుస అన్యాయాల‌తో ర‌గులుతున్నారు. ప్ర‌త్యేక హోదా అనేది ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్ అంశంగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇప్పుడు అంద‌రూ ఆగ్ర‌హంతో ఉన్నారు. వైసీపీ సైతం ప్ర‌త్యేక హోదా విష‌యంలో మౌనంగా ఉండ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అయితే ఇదే అంశంపై ర‌త్న‌ప్ర‌భ హోదా ముగిసిన అధ్యాయం అని చెప్ప‌డంతో బీజేపీపై ఇప్ప‌టికే ఉన్న ఆగ్ర‌హం మ‌రింత పెరిగిన‌ట్ల‌య్యింది. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని రత్న ప్రభ గుర్తు చేశారు. ఇందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారన్నారు. ర‌త్న‌ప్ర‌భ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఏ మాత్రం పోటీలో లేని బీజేపీని మ‌రింత పాతాళానికి తొక్కిశాయ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: