దేవాన్ష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీటీడీకి భారీ విరాళం

VUYYURU SUBHASH
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యఅన్నదాన కార్యక్రమానికి తమ వంతు సాయంగా 30లక్షల రూపాయలను దేవాన్ష్ పేరు మీద విరాళం ఇచ్చారు. ఈ మేర చెక్ ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల టీడీపీ నేత‌లు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుక‌లు కూడా నిర్వ‌హిస్తుండ‌డంతో పాటు మ‌రి కొన్ని చోట్ల అన్న‌దాన కార్య‌క్ర‌మాలు, ర‌క్త‌దాన శిబిరాలు కూడా నిర్వ‌హిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: