ఏపీలో ఆగ‌ని క‌రోనా... క‌ల్లోలానికి నో బ్రేక్‌

VUYYURU SUBHASH
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో 246 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు జిల్లాలో 58 కేసులు, చిత్తూరు జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఒకరు కోవిడ్ వల్ల మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,92,986కి పెరిగింది. మొత్తం 8,83,890 మంది కోలుకున్నారు. 

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు  7,187 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 31,546 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,46,74,210 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ దిశ‌గా ఆలోచ‌న చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: