మ‌రో రెండు గెలుపుల కోసం జ‌గ‌న్ రెడీ

VUYYURU SUBHASH
ఏపీలో స‌ర్పంచ్, మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో తిరుగులేని విజ‌యం సాధించ‌డంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రభుత్వం పట్టుపడుతుంది. త్వరగా ఎన్నికలు జరిపితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని.. ఆ త‌ర్వాత పూర్తిగా పాల‌న మీద దృష్టి పెట్ట‌డంతో పాటు మంత్రి వ‌ర్గంలో మార్పులు చేసి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడీ అయిపోవ‌చ్చ‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్‌. ఈ ఎన్నిక‌ల త‌ర్వాతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని జ‌గ‌న్ చూస్తున్నారు.
దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరగనుంది. ఈ నెలాఖ‌రుతో త‌న ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌డంతో వీటిని నిర్వ‌హించేందుకు నిమ్మ‌గ‌డ్డ సుముఖంగా లేరు. ఇక ప‌రిష‌త్ పోరుతో పాటు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించి మ‌రోసారి త‌న స‌త్తా చాటాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: