డీఎంకే కూట‌మిలో తేలిన సీట్ల లెక్క‌... ఏ పార్టీ ఎన్నంటే...

VUYYURU SUBHASH
త‌మిళ‌నాడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష డీఎంకే కూట‌మిలో సీట్ల సర్దుబాట ప్రక్రియ ముగిసింది. త‌మిళ‌నాడులో ఉన్న మొత్తం 234 స్థానాల‌కు గాను డీఎంకే 174 స్థానాల్లో పోటీ చేయ‌నుంది. మ‌రో వైపు అధికార అన్నాడీఎంకేలో సీట్ల సర్దుబాటు కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎంకే కూట‌మి మాత్రం జోరు మీద ఉండ‌డంతో పాటు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో క్లారిటీకి వ‌చ్చేసింది. డీఎంకే –174, కాంగ్రెస్‌–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌కు –3,  మనిదనేయ మక్క ల్‌ కట్చికి –2, కొంగు మక్కల్‌ దేశీయ కట్చికి –3 తమిళర్‌ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. మరో రెండు చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇచ్చారు.
రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం అయిన చెన్నైలో డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం వెలువడింది. ఎండీఎంకేతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు డీఎంకే చిహ్నంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎవరైనా కలిసి వచ్చినా వారు డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: