ఎన్టీఆర్ స్కాల‌ర్‌షిప్ టెస్ట్ డేట్ ఫిక్స్‌.. బంప‌ర్ ఆఫ‌ర్లు

VUYYURU SUBHASH
ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత ఆరేళ్లుగా గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు. పార్టీ 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ యేడాది ఈ ప‌రీక్ష‌ను ఈ నెల 28న నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎన్టీఆర్‌ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ నారా భువనేశ్వరి తెలిపారు. 

ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఉపకార వేతనం అందిస్తారు. ఆ త‌ర్వాత మొద‌టి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5వేలు, తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసే వరకు ఇవ్వనున్నట్లు భువనేశ్వరి తెలిపారు.
ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోన్న బాలిక‌లు ఈ అవ‌కాశం వినియోగించుకోవాల‌ని భువ‌నేశ్వ‌రి కోరారు. ఆసక్తిగల బాలికలు WWW.ఎన్‌టీఆర్‌ట్రస్ట్‌‌
.ఓఆర్‌జీలో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660002627, 7660002628 నెంబర్లలో సంప్రదించాలని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: