కొద్ది రోజులుగా చుక్కలనంటుతోన్న బంగారం ధరలు క్రమక్రమంగా దిగి వస్తున్నాయి. ప్రస్తుతం బంగారానికి అన్ సీజన్ కావడంతో పాటు అటు ద్రవ్యోల్బణం ఆందోళనలు, డాలర్ బలం నేపథ్యంలో బంగారం రేటు క్రమక్రమంగా తగ్గుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గి ధర 47,340 లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కూడా రూ.10 క్షీణించి రూ. 43,390కు చేరుకుంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే రు. 500 కేజీకి తగ్గి 68700 స్థాయికి చేరింది. బంగారం ధరలు 8 నెలల కనిష్టానికి సమీపంలోకి వచ్చి ఏకంగా రు. 10 వేలకు దిగి వచ్చినట్లయ్యింది.
మరింత సమాచారం తెలుసుకోండి: