కూతురు వైసీపీ ఎమ్మెల్యే.... త‌ల్లి స‌ర్పంచ్‌

VUYYURU SUBHASH
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ప‌లువురు టాప్ నేత‌ల బంధువులు స‌ర్పంచ్‌లుగా గెలుస్తూ స‌త్తా చాటుతున్నారు. అధికార వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి త‌న‌యుడు సురేష్ గుంటూరు జిల్లా నుంచి స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. ఇప్పుడు వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే త‌ల్లి సైతం స‌ర్పంచ్‌గా గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ గా గెలిచారు.

రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో  సర్పంచ్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాఘ‌వ గ‌తంలో కూడా ఈ పంచాయ‌తీ నుంచి 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే నాగుల‌ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి స్వ‌గ్రామం రాజుంపాలెం గొండోలు పంచాయ‌తీలో ఉంది. 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలుపొందారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: