బిగ్ బ్రేకింగ్: పంచాయతీ పోరులో సత్తా చాటిన స్పీకర్ కుటుంబం..!!

VUYYURU SUBHASH
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.  ఇక.. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఏపీలో మూడో విడత పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసినట్లైతే.. విడుదలైన అన్నీ పంచాయతీల్లోను  వైసీపీ తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ సర్పంచ్‌గా గెలుపొందారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్‌గా వాణిశ్రీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి తమ్మినేని భారతిపై వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తన తోడికోడలుపైన పంతం నెగ్గించుకున్నారు. దీంతో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణీ సీతారం ప్రతికారం తీర్చుకున్నట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచిన పంచాయతీ పోరులో స్పీకర్ కుటుంబం సత్తా చాటింది.  ఫలితం వెలువడిన అనంతరం వైకాపా కార్యకర్తలు వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: