ఏపీలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. మొత్తం 3,249 జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2,459పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 465, బీజేపీ, జనసేన 31, ఇతరులు 56 స్థానాలను దక్కించుకున్నారు. మరో కొన్ని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలాల్సి ఉంది. వైసీపీ మద్దతు దారులు ఎక్కువ సంఖ్యలో గెలవడంతో అధికార పార్టీలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. విచిత్రం ఏంటంటే టీడీపీ ప్రకాశం జిల్లాలో 50 కు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే అందులోనే సగం వరకు పరుచూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి.
ఇక జనసేన అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం డివిజన్లో ఏకంగా 26 పంచాయతీలు కైవసం చేసుకుంది. అక్కడే బీజేపీ కూడా ఒకటి రెండు సర్పంచ్ పదవులు కైవసం చేసుకుని సంచలనం క్రియేట్ చేసింది. ఏదేమైనా ఓవరాల్ పంచాయతీ పోరులో వైసీపీ తిరుగులేని విజయం సాధించిందనే చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: