యధావిధిగా ట్వీట్ చేసిన లోకేష్

ఏలూరులో పెరుగుతున్న వింత కేసులతో ఇప్పుడు అధికారులు ప్రజలు కూడా కంగారు పడుతున్నారు. కేసులు అన్నీ కూడా చిన్న పిల్లల్లోనే ఎక్కువగా ఉండటంతో తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు,150 మంది అస్వస్థతకు గురయ్యారు, అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు .వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది.వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం.దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.” అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: