వరద సాయంపై సీఎస్​ సోమేశ్​కుమార్​ సమీక్ష..!

N.ANJI
ఇటీవలె కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మరీ ముఖ్యంగా భాగ్యనగర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కాగా వారిని ఆదుకోనుకేందుకుగానూ తక్షణ సాయం కింద ప్రభుత్వం కొన్ని బాధిత కుటుంబాలకు రూ. 10వేలు అందజేసింది. అయితే తమకు సాయం అందలేదంటూ కొందరు బాధితులు నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం విధితమే.

ఈ మేరకు వరద భాదిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బాధితులు మొత్తం ఎంతమంది, ఎంతమందికి పరిహారం అందింది అనే విషయాలపై చర్చించారు. ఇప్పటి వరకు వరదలతో నష్టపోయిన 3.87లక్షల కుటుంబాలకు 387.90 కోట్లు పంపిణీ చేశామని అధికారులు సీఎస్కు వెల్లడించారు. వరద ముంపుకు గురై, మిగిలిన అర్హత కలిగిన కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని మరలా కొనసాగించాలని నిర్ణయించారు. దాని కోసం అవసరమైన ప్రణాళికను రూపొందించాలని ఆయా శాఖల కమీషనర్లను సీఎస్ ఆదేశించారు. వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని ప్రభావిత కుటుంబాలకు వారి ఇంటి వద్దే నగదు సహాయ పంపిణీని అందించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: