ఓటు వెయ్యండి.. టీకా పట్టండి..!

Lokesh
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామంటూ బిజేపి హామీ ఇవ్వడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటు వేస్తేనే, టీకా ఇస్తారా అంటూ విమర్శలు చేస్తున్నాయి.శశిథరూర్ కామెంట్స్ పై స్పందించారు బిజేపి నేత భూపిందర్ యాదవ్. "కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను మీ దృష్టికి తీసుకున్న విధానం నిరాశకు గురిచేసింది. అన్ని పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేశాయి.
నామమాత్రపు ధరకు దేశ ప్రజలకు టీకా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు వాటిని ఉచితంగా అందించగలవు. మేం వాటిని చేయగలం అని హామీ ఇచ్చాం" అంటూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు భూపిందర్​కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే కూడా ఈ తరహా వివరణే ఇచ్చారు. కానీ.. ఈ వివరణ నెటిజన్లను మెప్పించలేకపోయింది. దాంతో వారు 'వ్యాక్సిన్ ఎలక్షనిజమ్' అనే హ్యాష్‌ట్యాగ్​తో నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: