తెలంగాణలో కరోనా లెక్కలన్ని కాకి లెక్కలేనా...ఈ వార్నింగ్‌లు దేనికి సంకేతాలు..!
తెలంగాణలో రోజు రోజుకు కరోనా లెక్కలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం కావాలనే కరోనా లెక్కలు దాస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం అసలు లెక్కలు, బయటకు చూపించే లెక్కల్లో చాలా తేడా ఉందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా సగటున 7.2 శాతం పాజిటివ్ కేసులు నమోదైతే, తెలంగాణలో 21 శాతం నమోదయ్యాయి.
జనం పిట్టల్లా రాలిపోతున్నా కాకిలెక్కలతో కేవలం 15వేల కేసులే అని చెపుతున్నారన్న ఆరోపణలు విపక్షాల నుంచి ఉన్నాయి. ఇక గతంలో రోజుకు 2 వేల పరీక్షలు కూడా చేయడం లేదని నేరుగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరించాల్సి వచ్చింది. పలు సార్లు కేంద్ర బృందాల్ని పంపాల్సి వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు తెలంగాణ కేసుల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఇప్పటకి అయినా ప్రభుత్వం మారుతుందేమో ? చూడాలి.