భర్త మీద ప్రేమతోనే భరించింది: లహరి సోదరి

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లహరి  ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె వీడియో తాజాగా ఒక ప్రముఖ ఛానల్ ప్రస్తావించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆమె తన ఆవేదన అంతా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆమె సోదరి చైతన్య మీడియాతో మాట్లాడారు. ఆమె తనకు కేరళ ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళిపోతా అని చెప్పింది, చనిపోయే ముందు రోజు రాత్రి కూడా మాట్లాడినట్లు వివరించారు. 

 

పెళ్ళైన తరువాత భర్త వల్ల వేధింపులకు గురైందని అన్నారు. ఎన్నోసార్లు నచ్చజెప్పి తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని చెప్పారు. భర్త మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడని, భర్త మీద ప్రేమతో భరించింది అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: