బ్రేకింగ్ : అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు....?

Reddy P Rajasekhar

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ.ఎస్.ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తీర్పు ప్రకటనను నేటికి వాయిదా వేసింది.  నేడు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు అచ్చెన్నాయుడును గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. 
 
గుంటూరులోని రమేష్ ప్రైవేట్ ఆస్పత్రికి అచ్చెన్నాయుడును తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ.ఎస్.ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును ఈ నెల 1న పోలీసులు జీజీహెచ్ లో చికిత్స అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించగా అవినీతి జరిగిందని నిర్ధారణ కావడంతో ఆయనను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: