ముంబాయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..నీట మునిగిన పలు ప్రాంతాలు!
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబాయిలోనే ఉందని అంటున్నారు. అయితే ఈ మద్య ముంబాయిలో కరోనా మాత్రమే కాదు... మిడతల దాడులు.. తుఫాన్లు ఇప్పుడు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొలాబా అబ్జర్వేటరీ, శాంతాక్రజ్ ప్రాంతాల్లో గడచిన 24 గంటల వ్యవధిలో కుండపోత వానలు కురిశాయి. రాగల 24 గంటల్లో ముంబయిలో కుంభవృష్టి తప్పదని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) చెబుతోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ముంబయిని, కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. చెంబూర్, సెంట్రల్ ముంబయి నీటమునిగాయి. తీవ్ర వర్షాల దాటికి విద్యుత్ స్థంబాాలు కూలిపోయాయి.. కరెంట్ లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు.