ఐసీఐసీఐ సరికొత్త పాలసీ.... సైబర్ దాడులకు బీమా కవరేజీ....?

Reddy P Rajasekhar

మారుతున్న కాలంతో పాటు సైబర్ దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల నష్టం జరిగే సందర్భంలో ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో చాలా మందికి తెలియదు. . సైబర్ ఎటాక్స్, సైబర్ బెదిరింపులు, మాల్వేర్, బ్యాంక్ ఖాతాల చౌర్యం, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లకు సంబంధించిన మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అనధికార, మోసపూరిత ఆర్థిక నష్టాల నుంచి బీమా కవరేజీ ద్వారా రక్షణ లభిస్తుంది. 
 
ప్రస్తుతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహిస్తూ ఉండటంతో సైబర్ భద్రత ’ ప్రమాదం సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ పేరుతో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రారంభించింది. ‘రిటెయిల్ సైబర్ లయలబిలిటీ ఇన్సూరెన్స్’ పేరుతో ఈ పాలసీని అందుబాటులోకి తెస్తుంది. ప్రీమియం రోజుకు రూ. 6.50 నుంచి రూ. 65 వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 50 వేల నుంచి రూ. కోటి వరకు పరిహారం అందే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: