బ్రేకింగ్ : కేంద్రం సంచలన నిర్ణయం... యూనివర్సిటీల్లో పరీక్షలు రద్దు...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. తాజాగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో జులైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలను కేంద్రం రద్దు చేయాలని భావిస్తోంది. అతి త్వరలో పరీక్షల రద్దు గురించి అధికారికంగా ప్రకటన చేయనుందని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయం గురించి స్పష్టత రానుంది. 
 
మరోవైపు కరోనా విజృంభణ వల్ల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం వాయిదా వేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ వరకు విద్యాసంవత్సరం ప్రారంభాన్ని వాయిదా వేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది. రోజురోజుకు వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: