కావాల‌నే సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు.... సంజ‌య్ నిరుప‌మ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...?

Reddy P Rajasekhar

రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ మృతి గురించి అభిమానుల్లో, ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా రాజ‌కీయ నాయ‌కుడు సంజ‌య్ నిరుప‌మ్ సుశాంత్ అకాల మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిచోరే సినిమా సక్సెస్ తరువాత 7 సినిమాల్లో సుశాంత్‌ని త‌ప్పించార‌ని ఆయన ట్వీట్ చేశారు. 
 
సుశాంత్ ఏడు సినిమాల్లో నటించే అవకాశం కోల్పోవడానికి కారణం ఎవరు...? అని ప్రశ్నించారు. ప్ర‌తిభ గ‌ల నటుడిని బాలీవుడ్ పరిశ్రమ బలి తీసుకుందని.... పరిశ్రమలో క్రూరత్వం మరో స్థాయికి చేరిందని పేర్కొన్నారు. దర్శకుడు శేఖ‌ర్ క‌పూర్ సుశాంత్ పానీ సినిమాలో అద్భుతంగా నటించాడని.... సుశాంత్ ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేక సినిమాలు దూరం చేసిన వారు తనకు తెలుసు అంటూ ట్విట్టర్ పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: