బ్రేకింగ్‌: అచ్చెన్న ఆ త‌ప్పు బాబుకు తెలిసే చేశాడా..!

VUYYURU SUBHASH

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లో టీడీపీ స‌భ్యులు త‌మ‌కు అల‌వాటైన రీతిలోనే స‌రికొత్త డ్రామాకు తెర‌దీశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ని అక్ర‌మంగా అరెస్టు చేశారంటూ న‌ల్ల చొక్కాలు ధ‌రించి అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. దీనిపై ప‌లువురు మీడియా మిత్రులు ప్ర‌శ్నించిన‌ప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు బాబుకు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

 

ప్ర‌భుత్వ విప్‌, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అచ్చెన్నాయుడిని, జేసీ దివాక‌ర్‌రెడ్డిని క్ర‌మంగా అరెస్టు చేశార‌ని వాపోతున్న చంద్ర‌బాబు అచ్చెన్నాయుడు త‌ప్పు చేయ‌లేద‌న్న మాట ధైర్యంగా ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అసెంబ్లీ ముందు స‌రికొత్త నాట‌కానికి తెర‌లేపార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. శ్రీకాంత్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే చంద్ర‌బాబుకు తెలిసే ఇదంతా జ‌రుగుతుందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: