బ్రేకింగ్ : చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్ కు కరోనా...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా చంద్రబాబు ఇంటి దగ్గర విధుల్లో పాల్గొన్న ఒక వ్యక్తి కరోనా భారీన పడ్డాడు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్ హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్త్ విధుల్లో పాల్గొన్నారు. బాపట్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి మే 5న హైదరాబాద్ కు వెళ్లి 7న తిరిగి వచ్చాడు. 
 
అనంతరం కరోనా లక్షణాలు కనిపించడంతో కానిస్టేబుల్ పరీక్షలు చేయించుకున్నాడు. నిన్న వచ్చిన ఫలితాల్లో కానిస్టేబుల్ కు కరోనా సోకినట్లు తేలింది. హైదరాబాద్ లోని తోటి కానిస్టేబుల్ నుంచి అతనికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అధికారులు కానిస్టేబుల్ తో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: