తెలంగాణాలో మరో పులి అలజడి...!

తెలంగాణాలో రెండు రోజులకోసారి పులి పేరు వినపడుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట పులి గురించి చర్చలు వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ రంగారెడ్డి కామారెడ్డి సంగారెడ్డి, అదిలాబాద్ మెదక్ ఇలా ఎక్కడ చూసినా సరే పులి అనే పేరు ప్రజలను భయపెడుతుంది. తాజాగా మరోసారి పులి పేరు వినపడింది. మంచిర్యాల జిల్లాలో పులి కనపడింది. 

 

మంచిర్యాల కొముర్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలను భయపెడుతుంది. గత వారం రోజుల్లో పులి ఈ జిల్లాలో రోజుకో చోట కనపడుతుంది. బొగ్గు గనుల ఉండే పరిసరాలలోనే ప్రస్తుతం పెద్ద పులి ఉందని అధికారులు గుర్తించారు. తాండూరు, బెల్లంపల్లి పట్టణాల శివారులలో ఇది సంచరిస్తుంది. ఇక సింగరేణి కార్మికులు కూడా భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: