అప్పుడే 60 ఏళ్లు... నమ్మలేకపోతున్నా.... బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు....?
స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు 60వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు బసవతారకం ఇండోఅమెరికన్ ఆసపత్రిలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మొదట ఆస్పత్రిలోని తన తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసిన బాలకృష్ణ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారి చాక్లెట్లు, పుస్తకాలు అందజేశారు. వైద్యులు, సిబ్బంది బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పుడే 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. తాను మద్రాస్ లో పుట్టానని ఆరేళ్ల వయస్సులో హైదరాబాద్ కు వచ్చానని.... అందరి కృషి వల్ల బసవతారకం ఆస్పత్రి పరిస్థితి ఎంతో బాగుందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందని.... ఈ మహమ్మారి త్వరలో మనల్ని వీడి పోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా నివారణ కోసం ప్రభుత్వ సూచనలను పాటించాలని వ్యాఖ్యలు చేశారు.