బ్రేకింగ్ : జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారుకు ప్రమాదం....?

Reddy P Rajasekhar

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి కారు యాక్సిడెంట్ కు గురైనట్లు తెలుస్తోంది. ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. యాక్సిడెంట్ కు గురైన కారులో సుధీర్ రెడ్డి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సంఘటనా స్థలానికి ఎవరినీ రానివ్వడం లేదని... ఫోటోలు ఎవరినీ తీయనీయడం లేదని తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగులో వైసీపీ నుంచి పోటీ చేసి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. 
 
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజు నుండి నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సుధీర్ రెడ్డి పార్టీలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: