ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జియో మార్ట్ సేవలు.. వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు...?

Reddy P Rajasekhar

ప్రముఖ టెలీకాం సంస్థ జియో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ‘జియో మార్ట్’ లను ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వీటి ద్వారా సులభంగా కిరాణా వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని 30 ప్రధాన నగరాలు, పట్టణాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపింది. జియోమార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమకు కావసిన వస్తువులను వినియోగదారులకు సూచించింది. 
 
పళ్లు, కూరగాయలు, కూల్ డ్రింకులు ఇతర సామగ్రిని నిత్యావసర వస్తువులను ప్రజలు జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రతి వస్తువుపై డిస్కౌంట్లు ఉంటాయని.... ఎంఆర్పీ కంటే తాము కనీసం 5 శాతం రాయితీ కూడా ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఆర్డర్లు చెప్పిన సమయం కన్నా ముందే డెలివరీ చేస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: