ఆ కరోనా రోగి చనిపోయాడో లేదో చెప్పండి... తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ప్రశ్న...?

Reddy P Rajasekhar

తెలంగాణ హైకోర్టు హయత్‌నగర్ వాసి మధుసూదన్ మరణించారా లేదా అనే విషయం స్పష్టం చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన మధుసూదన్ మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. మధుసూదన్ మరణంపై ఆయన భార్య మాధవి అనుమానం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ ను తన భర్త ఆచూకీ గురించి చెప్పాలని కోరింది. 
 
తన భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించింది. మంత్రి ఈటల రాజేందర్ మే 1 మధుసూదన్ చనిపోయాడని... మిగతా కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉండటం... ఒకరోజు ముందే మధుసూదన్ తండ్రి ఈశ్వరయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని మధుసూదన్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. మధుసూదన్ మరణించారా లేదా అనే విషయాన్ని జూన్ 5 లోగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆశ్రయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: