బ్రేకింగ్ : అంత్యక్రియల్లో అపశృతి..... చిరు, చరణ్, ఉపాసనపై తేనెటీగల దాడి... ?
దోమకొండ సంస్థాన వారసులు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈరోజు జరిగాయి. అంత్యక్రియలకు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. అయితే ఈ అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. పార్థివదేహాన్ని బయటకు తీసుకొస్తున్న సమయంలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనలతో పాటు వారి బంధువులపై తేనెటీగలు దాడి చేశాయి.
సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనతో పాటు బంధువులను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. తేనెటీగలు వెళ్లిపోవడంతో యథావిధిగా అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఉమాపతి మనువరాలు ఉపాసన మెగాస్టార్ చిరంజీవి కోడలు అన్న విషయం తెలిసిందే.