బ్రేకింగ్: దేశం షాక్ అయ్యే న్యూస్ అంటూ సస్పెన్స్‌లో పెట్టిన కేసీఆర్...!
తెలంగాణ సీఎం కేసీఆర్ కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ సందర్భంగా ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రైతులకు తీపి కబురు చెబుతానని... ఆ వార్తతో దేశం షాక్ అవుతుందని అన్నారు. ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం కల నెరవేరిందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో కొండ పోచమ్మ రిజర్వాయర్ ఒక చారిత్రక ఘట్టం అని అన్నారు. ఒకప్పుడు ఏడుపు పాటల తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల తెలంగాణగా మారిందని తెలిపారు.
ఆరు సంవత్సరాలలోనే బంగారు తెలంగాణ కల సాధ్యమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆదర్శ రైతాంగం కావాలని అన్నారు. కరెంట్ కోతల నుంచి తెలంగాణ గట్టెక్కిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను నీటి తీర్వాను తీసుకోమని అన్నారు. కాళేశ్వరం కోసం భూములు ఇచ్చిన వారి త్యాగాలను మరవలేమని అన్నారు. లక్ష కోట్ల రూపాయల పంటలను తెలంగాణ రైతాంగం పండించబోతుందని తెలిపారు.