శ్రీవారి భక్తులకు శుభవార్త... ఆన్ లైన్ లో లడ్డూ అమ్మకాలు...?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో శ్రీవారి భక్తులు దర్శనానికి దూరమవుతున్న సంగతి తెలిసిందే. టీటీడీ వెంకన్న స్వామి దర్శనానికి దూరమైన భక్తుల కొరకు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో భక్తులకు లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్న టీటీడీ ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఇకపై ఆన్ లైన్ ద్వారా లడ్డూ అమ్మకాలను చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ఆన్ లైన్ లో లడ్డూలను ఆర్డర్ చేసే భక్తులకు వారికి సమీపంలో గల టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల నుంచి లడ్డూలు అందేలా టీటీడీ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.