పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకం... భయాందోళనలో ప్రజలు....?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 7వ తేదీ న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 5 గ్రామాలలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మరవక ముందే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకుంది.
వేమవరంలో పని చేయని బోరుకు మరమ్మత్తులు చేస్తున్న సమయంలో భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అయింది. విషయం తెలిసిన అధికారులు వరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వ్యవసాయ బోరును రిపేరు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.