తెలంగాణలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య... ఒక్కరోజే ముగ్గురు మృతి...?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ముగ్గురు కరోనా భారీన పడి మృతి చెందారు. నిన్న ఐదుగురు కరోనా భారీన పడి చనిపోగా ఈరోజు మరో ముగ్గురు చనిపోయారు. రెండు రోజుల్లోనే కరోనా భారీన పడి ఎనిమిది మంది మృతి చెందడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 62 కరోనా కేసులు నమోదయ్యాయి.
నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 42 కేసులు నమోదు కాగా 19 మంది వలస కార్మికులు కరోనా భారీన పడ్డారు. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదైంది. రాష్ట్రంలో ఈరోజు 7 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1042కు చేరింది.