అంఫన్ తుఫాన్ పై స్పందించిన రాష్ట్రపతి... బాధితులు త్వరగా కోలుకోవాలని...?

Reddy P Rajasekhar

అంఫన్ తుఫాను బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాన్ వల్ల బెంగాల్ లో 72 మంది మృతి చెందారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ అంఫన్ తుఫాన్ పై స్పందించారు. తుఫాన్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని తాను గవర్నర్ జగ్ దీప్ దంకర్, సీఎం మమతా బెనర్జీతో మాట్లాడానని చెప్పారు. తుఫాన్ వల్ల జరిగిన్ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి తెలుసుకున్నానని అన్నారు. 


 
ఈ సంక్షోభ సమయంలో అందరి సహాయసహకారాలు ఉంటాయని వారికి చెప్పనని... సమర్థవంతమైన రెస్క్యూ టీం, అధికారులు పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని...తుఫాను బాధిత రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని తాను భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: