‘ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్’ వీడియోతో తమన్నా కేక పెట్టించింది!

Edari Rama Krishna

దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ నడుస్తుంది. గత రెండు నెలల నుంచి సినిమా షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే.  దాంతో ఇంటికే పరిమితం అయ్యారు సిని తారలు.  మరి ఇంటి వద్ద ఊరికే ఉంటే తమకు సామాన్యులకు తేడా ఏంటీ అని చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది వ్యాయాలు, యోగాలు చేస్తుంటే..కొంత మంది వెరైటీ డ్యాన్స్ లు, టిక్ టాక్ లు చేస్తున్నారు.  కొంత మంది అందాల భామ‌లు గ్లామ‌ర్‌, న‌ట‌న‌తోనే కాదు వ‌ర్కవుట్స్‌తోను అభిమానుల‌ని ఫిదా చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త్రో బ్యాక్ వీడియోని షేర్ చేస్తూ అంద‌రు నోరెళ్ల పెట్టేలా చేసింది. ట్రైన‌ర్ స‌మ‌క్షంలో త‌మ‌న్నా చేసిన ఫీట్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ‘ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్’ మీకు అందిస్తున్నాను.

 

మోచేతులు, త‌ల‌ని బ్యాలెన్స్ చేస్తూ హెడ్‌ని ఖచ్చితంగా స్టాండ్ చేసే ప్ర‌య‌త్నాల‌లో ఇది ఒక‌టి అని  త‌మ‌న్నా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియో షేర్ చేసింది. అయితే తమన్నా చేస్తున్న  ఈ ఫీట్ తన ట్రైనర్ రికార్డు చేస్తూ పలు జాగ్రత్తలు సూచిస్తూ వచ్చింది. అంతేకాదు ఇలాంటి ఫీట్స్ చేస్తే..  ట్రైన‌ర్ స‌మ‌క్షంలోనే  చేయాల‌ని అమ్మ‌డు నెటిజ‌న్స్‌కి స్ప‌ష్టం చేసింది.  అయితే త‌ల‌పై బాడీని మొత్తం బ్యాలెన్స్ చేస్తూ త‌మ‌న్నా చేసిన వ‌ర్క‌వుట్‌ని వావ్ అనాల్సిందే. తాజాగా దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I present to you the ‘Art of falling'. Cannot stress enough upon the importance of falling and failing way before you get it right. One of many attempts of falling accurately before I could rise and do a perfect headstand. (Do not practice this without a trainer) #SoundOn #Headstand #throwbackthursday #fitnessfirst

A post shared by {{RelevantDataTitle}}