ఏపీలో ఆ జిల్లాను వణికిస్తోన్న కరోనా... ఒక్కరోజే 17 కేసులు నమోదు...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు 45 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2452కు చేరింది. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 54కు చేరింది. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
జిల్లాలో ఒక్కరోజే 17 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో నమోదైన కేసుల్లో పెదవేగు మండలం పినకడిమిలో 11 కేసులు, పెదపాడు మండలం తోటగూడెంలో రెండు కేసులు, ఆచంట నియోజకవర్గం పెనుగొండలో మూడు, సిద్ధాంతంలో ఒక కేసు నమోదైంది. ఈరోజు నమోదైన కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 91కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: