బ్రేకింగ్: ఎల్జీ పాలీమర్స్ వద్ద అలజడి

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద మరోసారి ఉద్రికిత వాతావరణం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ ముందు బాధిత గ్రామం అయిన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు నిరసన చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ వైపు గ్రామస్తులు దూసుకు వెళ్ళారు. గ్రామస్తులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 

 

ఇతర గ్రామస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తమను అసలు పట్టించుకోవడం లేదని అసలు గ్యాస్ లీక్ తో తమ గ్రామంలోనే ఎక్కువగా నష్టపోయాం అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గ్రామస్తులను కంపెనీలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇక్కడి నుంచి కంపెనీ తీసీయాలని డిమాండ్ చేసారు గ్రామస్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: