బ్రేకింగ్‌: విశాఖ ప‌రిహారం... 19893 మందికి ఒక్కొక్క‌రికి రు. 10 వేలు

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమీక్ష నిర్వహించారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధాకరం అని సీఎం అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. 19892 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని సీఎం తెలిపారు. గతంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటనలో 22 మంది చనిపోయారని అప్పుడు ప్రభుత్వం 20 లక్షలు నష్ట పరిహారం ఇచ్చిందని చెప్పారు. 
 
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై కమిటీలు వేశామని... పూర్తి నివేదికలు అందాల్సి ఉందని చెప్పారు. గతంలో ఓఎన్జీసీ ఘటన జరిగిప్పుడు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశానని... ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చామని చెప్పారు. ప్రతి విషయంలోను కూలంకుషంగా యుద్ధప్రాతిదికన చర్యలు చేపట్టాని... అధికారులు బాగా స్పందించారని సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: