బిగ్ బ్రేకింగ్: రైతులకు 9 గంటల పగటి కరెంట్.. వైఎస్‌ను మించిన జగన్ ఆఫర్..!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు 9 గంటల కరెంట్ పగటిపూటే అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రబీ నాటికి 18 శాతం ఫీడర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జనవరి నుంచి మే నెలలోపు 1500 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని అన్నారు. ఒక్కర్ కరోనా సమయంలోనే వెయ్యి కోట్ల రూపాయల మార్కెటింగ్ జరిగిందని జగన్ చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 436 రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మించేలా జగన్ పాలన ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.