బ్రేకింగ్: రైతుల కోసం 3 వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి..!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంటకు గిట్టుబటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం నిధుల విడుదల సందర్భంగా జగన్ రైతులనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్ పంట పెట్టుబడి కోసం ఒక్కో రైతుకు 5,500 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. కరోనా వల్ల ఏప్రిల్ నెలలో 2,000 ఇవ్వడంతో ప్రస్తుతం 5,500 ఇస్తున్నామని తెలిపారు. రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని అన్నారు.
జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలల్లో 1500 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధరల కోసం కేటాయించామని తెలిపారు. ఖరీఫ్ తో నష్టం జరిగితే రబీలో ఇన్సూరెన్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానికంగానే రైతుల పంటలకు మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తామని జగన్ అన్నారు.