కొడుకుతో కలిసి నటి సిమ్రన్‌ డాన్సు..  వైరల్ గా మారిన విడియో !!

Surya

తెలుగు , తమిళ్ , హిందీ , మలయాళం , కన్నడ వంటి పలు భాషల్లో నటించి అభిమానులను మెప్పించిన నటి సిమ్రాన్. అప్పట్లో ఈమె డాన్స్ చూసి అభిమానులు ఫిదా అయ్యేవారు . తరువాత ఏమైందో ఏమో 2003 లో తన చిన్ననాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకొని సినిమా లకు దూరం అయ్యింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. వీరి పేర్లు అధీప్‌ బగ్గా, అదిత్‌‌ బగ్గా. ఈమె న‌ట‌న‌తో పాటు క్లాసిక‌ల్ డ్యాన్స్‌, భ‌ర‌త‌నాట్యం వంటి వాటిలో శిక్ష‌ణ తీసుకున్న‌ది.

 

 అయితే సినిమాలకి దూరం అయినప్పటికీ తమిళ సినిమాలలో అమ్మడు సైడ్ రోల్స్ చేస్తూ కనిపిస్తోంది . తాజాగా క్వారంటైన్ సందర్భంగా తన కొడుకు తో కలసి కొన్ని డైలాగులను స్టెప్పులుగా మలచి ఓ అద్భుతమైన వీడియోను తయారు చేసింది ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. డాన్స్ కి సంబందించిన వీడియోస్ నే కాకుండా వంటలకు సంబందించిన వీడియోలను కూడా ఈమె పోస్ట్ చేసింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: