స‌రోజిని నాయుడు బ‌యోపిక్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Kaumudhi

ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల బ‌యోపిక్‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందాయి. చిత్ర‌సీమ‌లో స‌రికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. తాజాగా.. ప్ర‌ముఖ స్వాతంత్ర్య స‌మ‌రయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా స‌రోజిని నాయుడు జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతోంది. ఇందులో స‌రోజ‌ని దేవిగా దీపికా చిఖలియా న‌టిస్తోంది.  రామానంద్ సాగ‌ర్ నిర్మించిన రామాయ‌ణ్‌లో ఆమె పోషించిన సీత పాత్రకు మంచి గుర్తింపు వ‌చ్చింది. తాజాగా.. స‌రోజిని బ‌యోపిక్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇందులో దీపికా చిఖ‌లియా ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది.

 

కాగా, ఓ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలిపై భారీ చిత్రం రూపొందుతుంద‌డ‌డం ఇదే మొద‌టిసారని విశ్లేష‌కులు అంటున్నారు.  స‌రోజిని అనే టైటిత్‌తో తెర‌కెక్కుతున్న‌ఈ బయోపిక్‌కు ఆకాష్‌ నాయక్, ధీరజ్‌ మిశ్రా ద్వయం దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్‌ ఫిల్మ్‌ మీడియా సమర్పణలో కాను భాయ్‌ పటేల్‌ నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: