ఏపీలో సామాజిక దూరం అంటే ఇది... జగన్ ను విమర్శిస్తూ వీడియో పోస్ట్ చేసిన లోకేష్...?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక వీడియోను పోస్ట్ చేసి ఎన్నికల ముందు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చారని... కానీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారని... మద్యం దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించడం లేదని వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియోకు ఏపీలో సామాజిక దూరం అంటే ఇది అనే క్యాప్షన్ తో వీడియో షేర్ చేశారు. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించటంతో ఏపీ ప్రభుత్వం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను తగ్గించాలనే ఉద్దేశంతో 25 శాతం ధరలు పెంచింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల ధరల దగ్గర లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా ఆదేశాలు జారీ చేసింది.
మాస్కులు ధరించిన వారికి మాత్రమే మద్యం అమ్మాలని సూచించింది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నా టీడీపీ నాయకులు మాత్రం జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక దూరం అంటే ఇది...#LiquorShops #APInUnsafeHands pic.twitter.com/C7B5I4UeXq — lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 4, 2020