ఫోటోలు: కరోనా కాలంలో కేటీఆర్ - హరీష్ సహపంక్తి భోజనం, ఎందుకో తెలుసా ?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్నటివరకు 970 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సహపంక్తి భోజనం చేశారు. మంత్రులిద్దరూ ఈరోజు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రమించిన కార్మికులు, ఇంజనీర్లు, అధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 
 
మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందుకు సంబంధించిన ఫోటోలను ట్వీట్లు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం 3300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాదాపు 220 కిలోమీటర్లు కాళేశ్వరం నుంచి ప్రయాణించి సాగునీరు రంగనాయక సాగర్‌కు చేరుకుంటోంది. 
 
మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఈ రిజర్వాయర్ ద్వారా 1,10,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈరోజు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద మోటార్లను ఆన్ చేసి.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధిపేట పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను ఒక్క ఇళ్లు కూడా ముంపునకు గురి కాకుండా నిర్మించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: