ఏదన్నామంచి స్టోరీ చెప్పమంటే ..భయపెట్టే స్టోరీ చెప్పావేంటి..అనసూయా !
తెలుగు లో అటు బుల్లితెర కు మరియు సిల్వర్ స్క్రీన్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నయాంకర్ మన జబర్దస్త్ అనసూయ భరద్వాజ్. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది ఈ హాట్ యాంకర్. అయితే ఇంట్లో ఉంటె మాత్రం ఏంటి ఉన్నచోటనుండే తన అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ పంచె పనిలో పడింది మన అనసూయ భరద్వాజ్ . అయితే రీసెంట్ గా రైతులను ఆదుకొమ్మని పిలుపునిచ్చింది. లాక్ డౌన్ కారణంగా రైతులు బాగా నష్టపోతున్నారని అందరు రైతులను వారి దగ్గర కాయగూరలు మరియు ఇతర పంటలను కొనుక్కోవడం ద్వారా వారికి సహాయం చేయమని కోరింది.
అయితే ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో #AskAnsuya టాగ్ లైన్ తో కొన్ని పోస్ట్లు పెట్టడం స్టార్ట్ చేసింది. దానిలో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్ఛే పనిలో పడింది మన అనసూయ. ఈ సందర్భంగా ఓ నెటిజెన్
దయచేసి చూడటానికి కొన్ని హర్రర్ సినిమాలు సూచించండి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనసూయా కొన్ని హారర్ మూవీ టైటిల్స్ ను రీట్వీట్ లో ఆన్సర్ ఇలా షేర్ చేసింది .....ప్రస్తుతం నేను భూట్- హాంటెడ్ షిప్ చూడబోతున్నాను నేను కంజురింగ్ సిరీస్ మరియు అన్నాబెల్లె సిరీస్ లను చాలా చూసి ఆనందించానని సమాధానంగా తెలియజేసింది ....
Right now I am going to watch Bhoot- The Haunted Ship
I have enjoyed most of The Conjuring Series and Annabelle series https://t.co/BBIw6N6mk0 — anasuya Bharadwaj (@anusuyakhasba) April 22, 2020