కరోనాపై పోరాటంలో భారత్ కీలక పాత్ర... నాలుగు దేశాలకు భారత ఆర్మీ బృందాలు....!
భారత్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకుంటోంది. భారత సైన్యం కరోనాపై పోరాటంలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలను బృందాలను సిద్ధం చేస్తోంది. అధికారులు నిన్న ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ సైన్యం ఆయా దేశాలలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రయోగశాలల ఏర్పాటు విషయంలో కృషి చేయనుంది.
భారత సైన్యం కొన్ని రోజుల క్రితం మాల్దీవులకు 14 మందితో కూడిన బృందాన్ని, కువైట్ కు 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని పంపించింది. సార్క్ దేశాల్లో కరోనా నియంత్రణ కోసం భారత్ తన వంతు సహాయం చేస్తోంది. ఈ నెల మొదటివారంలో భారత్ కువైట్ కు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని కువైట్ కు పంపింది. కరోనా మహమ్మారిపై పోరాటానికి స్నేహ పూర్వక దేశాలకు భారత్ తన వంతు సహాయం చేస్తోంది.
ఇప్పటికే పలు దేశాలకు హైడ్రాక్సీ క్లిరోక్విన్, పారాసిటమాల్, ఇతర మందులను ఎగుమతి చేసి గొప్ప మనస్సు చాటుకున్న భారత్ ను ఇతర దేశాల అధ్యక్షులు ప్రశంసిస్తున్నారు.